|
|
by Suryaa Desk | Sun, Jul 13, 2025, 06:51 PM
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని పారిశ్రామిక వాడలో మరోసారి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎన్‌వీరో వేస్ట్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా అగ్నికీలలు ఎగసిపడటంతో దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా కమ్ముకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సమీప ఫైర్ స్టేషన్ల నుంచి అదనపు అగ్నిమాపక వాహనాలను కూడా రప్పించారు. ఈ పరిశ్రమలో వ్యర్థాల నిర్వహణ జరుగుతుంది. కాబట్టి, రసాయనాలు లేదా ఇతర మండే స్వభావం గల పదార్థాలు ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాప్తి చెంది ఉండవచ్చని ప్రాథమిక అంచనా. ప్రస్తుతం మంటలు భారీగా ఎగసిపడుతున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారీ ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని ఫైర్ సిబ్బంది భావిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల తెలియాల్సి ఉంది.