![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 07:48 PM
కర్ణాటక తరహాలో తెలంగాణలో పవర్ షేరింగ్ లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వంలో అందరం టీమ్ వర్క్‌తో పని చేస్తున్నామని ఆయన అన్నారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన రాష్ట్ర కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ప్రభుత్వ పనితీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.బీఆర్ఎస్ నాయకుల మాటలు మితిమీరుతున్నాయని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, ప్రజల్లోకి వెళ్లడం లేదని విమర్శించారు. రూ. 2 లక్షలు దాటిన వారికి రుణమాఫీ చేయొద్దన్నది తమ ప్రభుత్వం నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీ చేసినట్లు చెప్పారు. సన్న బియ్యం విజయవంతమైందని, గతంలో వలె పక్కదారి పట్టడం లేదని ఆయన అన్నారు.ఉచిత బస్సులకు మహిళల నుంచి మంచి స్పందన వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ పనులు జరుగుతున్నాయని తెలిపారు. మూసీ సుందరీకరణ పనులు ఈ ప్రభుత్వ హయాంలోనే పూర్తవుతాయని హామీ ఇచ్చారు. గాంధీ ఘాట్ వరకు సుందరీకరణ పనులు జరిగితీరుతాయని అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు కూడా వస్తోందని తెలిపారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చే అవకాశమే లేదని ఆయన వ్యాఖ్యానించారు