![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jul 13, 2025, 12:08 PM
ప్రియమిత్రుడైన కోట శ్రీనివాసరావు పార్థివదేహాన్ని చూసిన ప్రముఖ నటుడు బాబు మోహన్ భావోద్వేగానికి లోనయ్యారు. కోటన్నా అంటూ బోరున ఏడ్చారు. ఎంతో కాలంగా తనతో కలిసి అనేక సినిమాల్లో నవ్వులు పంచిన మిత్రుడిని కోల్పోవడం తట్టుకోలేక, కంటతడి పెట్టుకున్నారు. కోటతో కలిసి చేసిన సినిమాల జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ బాబు మోహన్ కన్నీటి పర్యంతమయ్యారు. “ఇలాంటి నటుడు మళ్లీ రావడం కష్టం” అంటూ కోటను కీర్తించారు.