![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 02:47 PM
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 26వ వార్డు సంజీవయ్య నగర్‌లోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న మున్సిపాలిటీ స్థలంలో ఓపెన్ జిమ్, చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పిల్లలు ఆడుకునేందుకు జారుడు బల్లలు, ఇతర ఆట వస్తువులు అవసరమని, అలాగే యువత, వృద్ధుల కోసం ఓపెన్ జిమ్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. ఈ సౌకర్యాలు ఏర్పాటైతే కాలనీ ప్రజలకు వినోదం, వ్యాయామం కోసం సమీపంలోనే అవకాశం లభిస్తుందని వారు పేర్కొన్నారు.
అయితే, సంజీవయ్య నగర్ కాలనీ అభివృద్ధి విషయంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో ఇప్పటివరకు ఇంటి నెంబర్ సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదని, ఇది ప్రజలకు ఇబ్బందిగా మారిందని వారు తెలిపారు. అభివృద్ధి పనులు చేపట్టడంలో పురపాలక సంఘం కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.
ఈ సమస్యలపై శనివారం స్థానికులు తమ గోడును వెల్లడించారు. కాలనీలో పిల్లలు, యువత, వృద్ధుల సౌకర్యార్థం ఆధునిక సౌకర్యాలు కల్పించాలని, అలాగే మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. పురపాలక సంఘం త్వరితగతిన స్పందించి, కాలనీ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానికులు ఆశిస్తున్నారు.