![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 10:17 AM
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు కుటుంబ సమేతంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలపై అమ్మవారి కరుణ, కటాక్షాలు ఎప్పుడూ ఉండాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నారని ప్రశంసించారు.అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం మరింతగా పెంపొందాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మహేష్ గౌడ్ గారు పునరుద్ఘాటించారు.