![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 02:33 PM
మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి ఖమ్మం కోర్టులో ఊరట లభించింది. రేణుకా చౌదరిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుని న్యాయస్థానం కొట్టివేసింది. 2014 సంవత్సరంలో వైరా ఎమ్మెల్యే టికెట్ తమకు (భూక్య రాంజీ సతీమణి కళావతికి లేదా ఆమె భర్తకు) ఇప్పిస్తానని రేణుకా చౌదరి మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు న్యాయస్థానాన్ని కళావతి ఆశ్రయించారు. ఈ కేసుపై ఖమ్మం జిల్లా కోర్టులోని ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో విచారణ కొనసాగింది. నేరం రుజువు కాకపోవడంతో ఇవాళ (జులై11, శుక్రవారం) కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.