![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 11:45 AM
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు ఆర్థిక సహయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ స్కీం ద్వారా అర్హత గల రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6,000 మూడు సమాన విడతలలో (ప్రతి విడత రూ. 2,000) నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఇప్పటివరకు 19 విడతలు విజయవంతంగా పంపిణీ చేయగా, 2025 ఫిబ్రవరి 24న 19వ విడతలో 9.8 కోట్ల రైతులకు రూ. 22,000 కోట్లు విడుదలయ్యాయి. ఈ పథకం రైతులకు వ్యవసాయ ఖర్చులు, గృహ అవసరాల కోసం ఆర్థిక భరోసాను అందిస్తోంది.
20వ విడత డబ్బుల కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం, ఈ విడత డబ్బులు 2025 జులై 10 తర్వాత విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఈ తేదీకి సంబంధించి ఇంకా అధికారిక ధ్రువీకరణ రాలేదు. గత విడతల మాదిరిగానే, ఈ విడత కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా రైతుల ఆధార్‌తో లింక్ చేయబడిన బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. రైతులు తమ ఈ-కేవైసీ పూర్తి చేయడం, ఆధార్-బ్యాంకు ఖాతా లింక్‌ను ధ్రువీకరించడం తప్పనిసరి.
ఈ స్కీంలో పాల్గొనే రైతులు తమ అర్హతను నిర్ధారించుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inలో బెనిఫిషియరీ లిస్ట్‌ను చెక్ చేయాలి. ఈ-కేవైసీ పూర్తి చేయని రైతులు ఈ విడత నిధులను పొందలేరని ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతులు తమ బ్యాంకు వివరాలు, ఆధార్ లింక్‌ను అప్‌డేట్ చేసి, ఫార్మర్ రిజిస్ట్రీలో తమ పేరును నమోదు చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే, 20వ విడత రూ. 2,000 నిరాటంకంగా రైతుల ఖాతాల్లో జమ కాగలదు.