![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 06:13 AM
హైదరాబాద్‌లో జరిగిన అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తాజ్ కృష్ణ హోటల్‌లో 249వ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశం, అమెరికా మధ్య దౌత్య సంబంధాలు 1947లో ప్రారంభమై నేటి వరకు రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, విద్య, సాంకేతిక రంగాల్లో మరింత దృఢంగా మారాయని అన్నారు. ఈ వేడుకలో భారత్-అమెరికా స్నేహ సంబంధాలను గుర్తు చేస్తూ, రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.