![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jul 13, 2025, 07:07 PM
తీన్మార్ మల్లన్న తన పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం పైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఈరోజు తనపైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ని కలిసిన ఎమ్మెల్సీ కవిత అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఇన్ఫెక్షన్సందర్భంగా తీన్మార్ మల్లన్నకు హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణలో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంటుందని, బిసి బిడ్డల్లో గౌరవించే అవకాశం మెండుగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. రాజకీయాల్లో మహిళలపైన పరుష పదజాలం వాడడంతో రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ జాగృతి విషయంలో బీసీ రిజర్వేషన్ల అమలుకై పోరాటం చేస్తూనే ఉన్నామని పేర్కొన్న ఎమ్మెల్సీ కవిత, మీరు బీసీ బిడ్డా కాబట్టి ఏదీపడితే అదీ మాట్లాడితే సరికాదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
తీన్మార్ మల్లన్న మీరు మాట్లాడిన మాటలకు మావాళ్ళకు కోపం వచ్చి నిరసన వ్యక్తం చేశారని పేర్కొన్నారు.ఇంత మాత్రనికే గన్ ఫైర్ చేసి చంపేస్తారా అంటూ ప్రశ్నించారు. ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారా !? అని నిలదీశారు. ఇక ఊరుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి, లేదంటే మీరు వెనకనుండి మాట్లాడించారని భావించాల్సి ఉంటుంది అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.