![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 07:42 PM
దేవరకద్ర: మూసాపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు మాజీ సర్పంచులు బోయిని చంద్రశేఖర్, భాస్కర్ గౌడ్, లలిత నరేష్ నాయక్, ఖలీమ్, ఎంపీటీసీ కాండ్యనాయక్, మండల కోఆప్షన్ జామీర్, నాయకులు, కార్యకర్తలు గురువారం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కుసుమ కుమార్, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.