![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 02:15 PM
ఇప్పుడీ వ్యాపార ప్రపంచంలో ప్రియా నాయర్ అనే పేరు మార్మోగుతోంది. హిందూస్థాన్ యూనీలీవర్ (హెచ్‌యూఎల్) తదుపరి సీఈవోగా, ఎండీగా ఆమె పేరును ప్రకటించడమే ఇందుకు కారణం. కంపెనీ 92 ఏళ్ల చరిత్రలో ఓ మహిళ సీఈవో కావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ప్రియా నాయర్ ఎవరన్న ఉత్సుకత మొదలైంది. హెచ్‌యూఎల్‌కు ప్రస్తుతం సీఈవోగా ఉన్న రోహిత్ జావా పదవీకాలం ఈ నెల 31తో ముగుస్తుంది. ఆగస్టు 1న ప్రియా నాయర్ బాధ్యతలు చేపడతారు. హెచ్‌యూఎల్‌ను నడిపించనున్న తొలి మహిళగా రికార్డులకెక్కిన ప్రియ సంస్థ బోర్డులోనూ చేరనున్నారు. అలాగే, యూనీలీవర్ లీడర్‌షిప్ ఎగ్జిక్యూటివ్ (యూఎల్ఈ) సభ్యురాలుగానూ కొనసాగుతారు. ప్రస్తుతం ఆమె యూనీలీవర్‌లో బ్యూటీ, వెల్‌బీయింగ్ విభాగానికి ప్రెసిడెంట్‌గా ఉన్నారు.