![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 12:39 PM
తెలంగాణలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఫీజులు పెంచాలన్న ప్రైవేటు కాలేజీలు అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తిరస్కరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఫీజుల పెంపు కోసం ఇచ్చిన వినతులపై టీఏఎఫ్‌ఆర్‌సీ (తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ) నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఆరు వారాల్లో నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించింది.