|
|
by Suryaa Desk | Wed, Jul 23, 2025, 05:01 PM
చాలా తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఫ్యామిలీ సినిమాలు కూడా నేడు ప్రత్యేకతను చాటుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. నిజానికి సహజత్వానికి చాలా దగ్గరగా అనిపించే ఇలాంటి సినిమాలే ఈ మధ్య కాలంలో భారీ వసూళ్లను రాబడుతూ ఆశ్చర్య పరుస్తున్నాయి.అలా కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా వైపు నుంచి వచ్చిన సినిమాగా '3BHK' కనిపిస్తుంది. అరుణ్ విశ్వ నిర్మించిన ఈ సినిమాకి శ్రీ గణేశ్ దర్శకత్వం వహించాడు. అరవింద్ సచ్చిదానందం రాసిన '3BHK వీడు' అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. జులై 4వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమాలో, సిద్ధార్థ్ .. శరత్ కుమార్ .. దేవయాని .. చైత్ర ఆచార్ .. యోగిబాబు ప్రధానమైన పాత్రలను పోషించారు.అలాంటి ఈ సినిమా ఆగస్టు 4వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ కానుంది. సిటీలో ఒక మధ్య తరగతి ఫ్యామిలీ నివసిస్తూ ఉంటుంది. ఆర్ధికపరమైన అవసరాల నుంచి గట్టెక్కడానికే వాళ్లు నానా అవస్థలు పడుతూ ఉంటారు. సొంతఇల్లు అంటూ ఉంటేనే ఊరు మనది అవుతుందని భావించిన ఆ ఫ్యామిలీ, ఒక 3BHK ఇంటిని సొంతం చేసుకోవడమే 'కల'గా పెట్టుకుంటుంది. ఆ కలను నిజం చేసుకోవడానికి వాళ్లు ఏం చేస్తారు? ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తారు? అనే మలుపులతో ఈ కథ నడుస్తుంది.
Latest News