|
|
by Suryaa Desk | Wed, Jul 23, 2025, 05:01 PM
ప్రజలకు సంపూర్ణంగా సేవ చేయాలంటే రాజకీయ రంగమే సరైన వేదిక అని ప్రముఖ సినీ నటుడు విజయ్ ఆంటోనీ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 'భద్రకాళి' చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.ప్రముఖ నటులు రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో మీ అభిప్రాయం ఏమిటని విలేకరి అడిగిన ప్రశ్నకు విజయ్ ఆంటోనీ సమాధానమిస్తూ, ప్రజలకు సేవ చేయాలనే తలంపు ఉంటే రాజకీయాలు సరైన మార్గమని అన్నారు. వ్యక్తిగతంగా సేవ చేస్తే పరిమిత సంఖ్యలో ప్రజలకు మాత్రమే సహాయం చేయగలమని, అదే రాజకీయాల్లోకి వస్తే ఒకేసారి ఎంతోమందికి మేలు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.ప్రజాసేవ చేయాలనే ఆసక్తి ఉన్న ఎవరైనా రాజకీయాల్లోకి వెళ్లవచ్చని తెలిపారు. అయితే, తనకు రాజకీయ రంగంపై ఆసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.
Latest News