|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 11:37 AM
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-9 గ్రాండ్ ఫినాలేకు చేరువవుతోంది. గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ రేసులో తనూజ, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. ఈ వారం ఊహించని విధంగా రీతూ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. కళ్యాణ్, తనూజ, ఇమ్మానుయేల్, డీమాన్ పవన్, భరణి శంకర్ టాప్ 5లో ఉంటారని అంచనా.
Latest News