|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 03:18 PM
కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య నటిస్తున్న 'సూర్య 47' చిత్రం పూజా కార్యక్రమాలు ఆదివారం చెన్నైలో ఘనంగా జరిగాయి. మాలీవుడ్ మూవీ 'ఆవేశం' ఫేం జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్య పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. మలయాళం, తమిళ బైలింగ్యువల్ మూవీగా వస్తున్న ఈ చిత్రానికి సుశిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ వివరాలపై త్వరలో స్పష్టత రానుంది.
Latest News