![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 02:50 PM
అసెంబ్లీ వేదికగా ఆటో కార్మికుల పక్షాన BRS ప్రశ్నించిందని పార్టీ నేత హరీశ్ రావు గుర్తుచేశారు. 'ఆటో కార్మికులకు కేసీఆర్ అండగా ఉంటారు. CM రేవంత్ ఎన్నికల హామీలను అమలు చేసి, ఆటో కార్మికులకు భద్రత కల్పించాలి. BRS పక్షాన డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు కనీసం రూ. 10 లక్షల ఆర్థిక సాయం చేయాలి. రెండేళ్లుగా ఒక్కో కార్మికుడికి బాకీ పడ్డ రూ. 24 వేలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి' అని డిమాండ్ చేశారు.