|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 07:35 PM

BRS ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ తమ లెక్కలోకి రారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వారు చేస్తున్న విమర్శలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని గురువారం హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వెల్లడించారు.ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తమ తప్పు ఒప్పులను చెప్పాలని అన్నారు. కేసీఆర్ సలహాలు ఇస్తే స్వీకరిస్తామని.. తప్పులను చూపిస్తే సరిదిద్దుకుంటామని అన్నారు. కేసీఆర్ తోనే తమకు లెక్క అని.. హరీష్ రావు ఎవరో నాకు తెలీదని అన్నారు. రాష్ట్రంలో ట్రాఫిక్ సమస్యపై ప్రెస్ మీట్ లో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ట్రాఫిక్ రద్దీగా ఉన్న రోడ్లను గుర్తించి ప్రేయార్టీ బేస్ పై హ్యమ్ మోడల్ లో రోడ్లను వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. సీఎంతో చర్చ జరిపి ఈ నెలాఖరు వరకు 15 ప్యాకేజీలు వరకు సెప్టెంబర్ లో పనులు మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు కోమటిరెడ్డి.దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో హ్యామ్ మోడల్ రోడ్లు వేశారని.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 6వేల 500 కోట్ల రూపాయలను రోడ్ల కోసం విడుదల చేశామని అన్నారు. రూ. 15వందల కోట్లతో అప్రోచ్ రోడ్లు లేకుండా గ్రామాలకు లింక్ బ్రిడ్జ్ లు గత ప్రభుత్వం కట్టిందని అన్నారు కోమటిరెడ్డి. రూ. 350 కోట్లతో అప్రోచ్ రోడ్లను వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. సింగిల్ రోడ్లను పునరుద్ధరణ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి.