![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 03:07 PM
మణుగూరు మండలం హనుమాన్ ఫంక్షన్ హాల్లో మంగళవారం లబ్దిదారులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లను రాజకీయాలకతీతంగా మంజూరు చేస్తామన్నారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తూ ముందుగు సాగుతున్నాయని తెలిపారు. లబ్ధిదారుల ముఖాలలో ఆనందం చూస్తుంటే తాను భావోద్వేగానికి లోనయ్యానని అన్నారు.