ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 11:16 AM
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని నేరడ గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పొలంలో పని చేస్తుండగా అకస్మాత్తుగా మూర్ఛ రావడంతో బురద పోలంలో పడిపోయి ఊపిరాడక ఓ రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన వడ్డేపల్లి సైదులు (40) గురువారం తన వ్యవసాయ బావి వద్ద పొలం పనులు చేస్తుండగా అకస్మాత్తుగా మూర్ఛ వచ్చి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అదే సమయంలో బురదలోనే పడిపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.