|
|
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 04:47 PM
పటాన్చెరు : పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామ పరిధిలో గల గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక దేవాలయాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం గణేష్ గడ్డ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ గ్రామ ప్రముఖులు, ఆలయ ధర్మకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి గుడి అభివృద్ధి పై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడికి నాలుగు వైపుల నిర్మిస్తున్న రాజగోపురం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించారు. ప్రధానంగా నిత్య అన్నదానం కోసం ఇబ్బందులు తలెత్తకుండా ఆధునిక కిచెన్ తోపాటు.. వివాహాది శుభకార్యాల కోసం కళ్యాణమండపం, శాలహారం, గుడి ఆదాయం కోసం దుకాణాల సముదాయం నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గుడిని అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, పిఎసిఎస్ అధ్యక్షులు పాండు, మాజీ ఎంపీటీసీ రాజు, ఆలయ కార్యనిర్వహణ అధికారి లావణ్య, శ్రీనివాస్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.