![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 10:18 AM
పాశమైలారం సిగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటన 42 కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఘటన జరిగి 9 రోజులు గడుస్తున్నా.. ఇంకా 8 మంది కార్మికుల ఆచూకీ తెలియరాలేదు. అయితే ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రమాదం జరిగిన స్పాట్‌కు వెంటనే వెళ్లాలంటూ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA)కి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కాసేపట్లో ఎన్‌డీఎంఏ బృందం పాశమైలారంకు చేరుకోనుంది.