![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 11:46 AM
మగ శిశువు విక్రయానికి సంబంధించిన వ్యవహారం బయటకు రావడంతో రెండు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ రఘుపతి తెలిపారు. నాగారం ప్రాంతానికి చెందిన నజీర్, ముస్కాన్ దంపతులకు నాలుగు రోజుల క్రితం మగ బాబు జన్మించాడు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న నజీర్ తన స్నేహితుడి ద్వారా బాబును చంద్రశేఖర్ కాలనీకి చెందిన ఇద్దరు మహిళలకు రూ.2 లక్షలకు అమ్మే ప్రయత్నం చేశాడు. రూ.1 లక్ష తీసుకుని, మిగతా మొత్తానికి సమయం పెట్టుకున్నారు. అయితే డబ్బు ఆలస్యం కావడంతో తల్లి మనసు మార్చుకుని బాబును తిరిగి తీసుకోవాలనడంతో లొల్లి జరిగింది.