![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 07:31 PM
కాంగ్రెస్, BJP, TDP ఏకమై తమ పార్టీపై దాడి చేస్తున్నాయని BRS నేత డాక్టర్ కే.సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలపైన, నీళ్లపైన దాడి జరుగుతోందని విమర్శించారు. 'తెలంగాణ పట్ల చంద్రబాబు మోసపూరితంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు, శిష్యుడు రేవంత్ రెడ్డి అబద్ధాల్లో పెద్దన్నలుగా మారారు. నీళ్ల విషయంలో TGకి జరుగుతున్న అన్యాయంపైనే హరీశ్ రావు మాట్లాడుతున్నారు. నీళ్ల అంశంపై అసెంబ్లీ ఎప్పుడు పెట్టినా BRS రెడీగా ఉంటుంది' అని చెప్పారు.