|
|
by Suryaa Desk | Sun, Jul 06, 2025, 02:14 PM

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఐసెట్ (TG ICET) ఫలితాలు జూలై 7న విడుదల కానున్నాయి. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫలితాలను ప్రకటించనున్నట్లు కన్వీనర్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రవి తెలిపారు. జూన్‌లో విడుదలైన ప్రాథమిక కీపై అభ్యంతరాలను జూన్ 26 వరకు స్వీకరించారు. ఫలితాలు https://icet.tsche.ac.inలో చూడవచ్చు.
8న ఎల్‌పీసెట్ కౌన్సెలింగ్
ఐటీఐ కోర్సులు పూర్తిచేసిన వారికి పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఎల్‌పీ సెట్ కౌన్సెలింగ్‌ను ఈ నెల 8న నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఎల్‌పీ సెట్‌లో 355 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారని, వీరికి అడ్మిషన్లు కల్పించేందుకు సోమవారం మాసాబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు.