![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 03:23 PM
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిట్కుల్ గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రీల్స్ కోసం ఆటగా టవల్‌తో ఆడుకుంటున్న ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం, ఆ చిన్నారి టవల్‌ను ఫ్యాన్‌కు కట్టుకొని రీల్స్ తీయడానికి ప్రయత్నించిందని తెలుస్తోంది. ఇదే సమయంలో అకస్మాత్తుగా కరెంట్ వచ్చి టవల్ మెడకు బిగుసుకుంది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు అటెంచి లేకపోవడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటన కుటుంబ సభ్యుల గ్రామస్థులను కూడా తీవ్ర విషాదంలో ముంచింది. చిన్నారి మరణం కారణంగా ఇంట్లో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన చిన్నారుల ఆటలపట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.