![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 05:15 PM
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఋతుపవనాలకు తోడు, అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో నిన్న మోస్తరు వర్షం కురిసింది. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు ఇక గోదావరి పరివాహక ప్రాంతాలైన ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు కొమరం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రేపు ఈ జిల్లాలలో అతి భారీ వర్షాలు రేపు నిజామాబాద్, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సూచిస్తుంది. నిండు కుండల్లా జలాశయాలు ఇదిలా ఉంటే ఇప్పటికే కృష్ణ పరివాహక ప్రాంతాలలో ఎగువన కురుస్తున్న వర్షాలతో ఆయా ప్రాంతాలలోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక శ్రీశైలం జలాశయం కూడా నిండుకుండలా మారింది. ప్రస్తుతం శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త స్టాంప్ డ్యూటీ బిల్లు.. మహిళలకు స్పెషల్ రాయితీ! నాగార్జున సాగర్ లో పెరుగుతున్న నీటి మట్టం మరోవైపు నాగార్జునసాగర్ కు కూడా వరద నీరు వస్తుండడంతో నీటిమట్టం పెరుగుతుంది. ఇక వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న అన్నదాతలు వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో వరుణ దేవుడి కరుణ కోసం నిరీక్షిస్తున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఆశించిన దానికంటే చాలా చోట్ల తక్కువ వర్షపాతం నమోదు అయినట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.