|
|
by Suryaa Desk | Wed, Jul 30, 2025, 06:57 PM
ప్రముఖ ఇజ్రాయెల్ నటుడు అలోన్ అబుత్బుల్ (60) కన్నుమూశారు. మంగళవారం హైఫా సమీపంలోని బీచ్‌లో నీటి నుండి బయటకు వచ్చిన అబుత్బుల్.. తనకు అనారోగ్యంగా ఉందని చెప్పి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సంఘటన స్థలంలోనే ఆయన మరణించినట్లు సమాచారం. అతను ది డార్క్ నైట్ రైజెస్, బాడీ ఆఫ్ లైస్ వంటి చిత్రాలలో నటించాడు. అతనికి 44వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఉత్తమ నటుడిగా అవార్డు కూడా లభించింది.
Latest News