|
|
by Suryaa Desk | Wed, Jul 30, 2025, 02:13 PM
ప్రముఖ నటుడు, సమాజ సేవకుడు సోనూసూద్. హిందీ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి.. తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో చేసిన సమాజ సేవతో దేశవ్యాప్తంగా ప్రజల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. సోనూసూద్ ఫౌండేషన్‌ను స్థాపించి నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు. సోనూసూద్ జులై 30న తన 52వ పుట్టినరోజును జరుపుకోనున్నారు.సోనూసూద్ 1973 జులై 30న పంజాబ్‌లోని మోగా పట్టణంలో జన్మించారు. అతని తండ్రి వ్యాపారవేత్త, తల్లి ఉపాధ్యాయురాలు. సోనూ సూద్ నాగపూర్‌లోని యశ్వంత్‌రావ్ చవాన్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండడంతో చదువు పూర్తయిన తరువాత ముంబైకి వెళ్లి, సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నించారు. 1999లో తమిళ చిత్రం "కల్లజగర్"తో సినీ రంగంలోకి అడుగుపెట్టారు.
Latest News