|
|
by Suryaa Desk | Tue, Jul 29, 2025, 03:28 PM
బాలీవుడ్ యంగ్ బ్యూటీ, అలనాటి అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ ఓ ఫ్యాషన్ ఈవెంట్‌లో తళుక్కున మెరిశారు.న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో జరుగుతున్న హ్యుందాయ్ ఇండియా కౌచర్ వీక్ 2025 లో సందడి చేశారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జయంతి రెడ్డి రూపొందించిన పింక్ కలర్ లెహంగాలో ర్యాంప్ వాక్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జాన్వీ ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.ఇక సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ సినిమా దేవరతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన జాన్వీ కపూర్.. ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి పెద్ది చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు హోమ్‌బౌండ్, సన్నీ సంస్కారి కి తులసి కుమారి, పరమ్ సుందరి లాంటి బాలీవుడ్ సినిమాల్లో కనిపించనుంది.
Latest News