|
|
by Suryaa Desk | Tue, Jul 29, 2025, 03:21 PM
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల్లో నటించినప్పటికీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. కొద్ది కాలంపాటు ఇండస్ట్రీకి దూరం అయిన ఈ భామ ఇటీవల నిర్మాతగా మారి మొదటి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది.'శుభం'(shubham)మూవీ నిర్మించిన సామ్ ఇందులో ఓ కీలక పాత్రలోనూ నటించి చాలా రోజుల తర్వాత సినీ ప్రియులను తన నటనతో మంత్రముగ్దులను చేసింది. ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ ప్రకటించనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. 'టేక్-20 హెల్త్' పేరుతో ఓ పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేసి గత కొద్ది కాలంగా ఫిట్‌నెస్, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను పంచుకుంటోంది. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసి అందరినీ షాక్‌కు గురయ్యేలా చేసింది. డెడ్‌హ్యాంగ్ ఛాలెంజ్‌ను తీసుకున్నట్లు వెల్లడించింది. ''మీరు ఎలా కనిపిస్తున్నారు అనేది విషయం కాదు. ఈ సమాజానికి మీ వారసత్వం ఏమిటనేది కూడా ముఖ్యం కాదు. సెల్ఫీలు పంచుకోవడం కూడా ప్రాధాన్యం కాదు. ఎవరూ చూడనప్పుడు మీరు ఎంత బలంగా ఉన్నారనేది ముఖ్యం'' అనే క్యాప్షన్ జత చేసింది. అలాగే పైన పట్టుకుని వేళాడుతున్న వీడియోను షేర్ చేసింది. ఇక అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం స్ట్రాంగ్ ఉండాలని సమంతకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఇక ఇందులో సామ్ ఫిట్‌గా నాజుకుగా కనిపించి అందరినీ ఫిదా చేసింది.