|
|
by Suryaa Desk | Sat, Jul 26, 2025, 11:08 AM
2023లో ప్రేమ వివాహం చేసుకున్న నటుడు వరుణ్‌తేజ్- లావణ్య త్రిపాఠి త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. వెకేషన్‌కు వెళ్లిన వరుణ్‌తేజ్, లావణ్య శుక్రవారం హైదరాాబాద్ చేరుకున్నారు. బేబీ బంప్‌తో లావణ్య కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పింక్ కలర్ కంఫర్టబుల్ డ్రెస్‌లో ఉన్న లావణ్య.. ముద్దుగా, సూపర్ క్యూట్‌గా కనిపించింది. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ కాగా ఎలాంటి దిష్టి తాకకూడదని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఆరోగ్యంగా బిడ్డను కనాలని.. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు.
Latest News