|
|
by Suryaa Desk | Sat, Jul 26, 2025, 02:05 PM
‘కింగ్డమ్’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో హీరో విజయ్ దేవరకొండ తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఎక్కువ సమయం గడపాలని ఉందన్నాడు. గత రెండు, మూడేళ్లుగా తాను జీవించిన విధానం తనకే నచ్చడం లేదన్నాడు. ఆ విషయాన్ని తనకు తానే గ్రహించి కొన్ని పద్ధతులను మార్చుకున్నట్లు తెలిపాడు. కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని ఆస్వాదిస్తున్నట్లు తెలిపాడు. చాలా రోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ మూవీ ఈనెల 31న విడుదల కానుంది.
Latest News