|
|
by Suryaa Desk | Fri, Jul 25, 2025, 04:28 PM
సూపర్ స్టార్ రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ సినిమా 'కూలీ' . దీనిని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.ఇందులో ఉపేంద్ర, నాగార్జున, సాబిన్ షాహిర్, శ్రుతి హాసన్, ఆమిర్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఆగస్టు-14 థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రుతి హాసన్(Shruti Haasan) 'కూలీ' మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ''కూలీ సినిమా చాలా స్పెషల్ గా అనిపించింది. ఎందుకంటే అది నాగార్జున(Nagarjuna) సర్‌కు మొదటి నెగెటివ్ రోల్ కాబట్టి. ఇందులో అతను అద్భుతంగా నటించాడు. ఆయన నటన చూశాక అతనికి అభిమానిగా అయిపోయాను.
ఇప్పుడు మేము సూపర్ ఫ్యాన్స్. రజనీకాంత్ చాలా కూల్ పర్సన్. ఆయన చాలా పెద్ద పేరు, గొప్ప విజయం సాధించారు, కానీ ఇప్పటికీ ఆయన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ సుఖంగా ఉంచుతున్నారు. దానికి నేను నిజంగా కృతజ్ఞురాలిని. ఇక ఇందులో సత్యరాజ్ సర్ కూతురి పాత్రను పోషిస్తున్నాను. నేను ఇనిమెల్ మ్యూజిక్ వీడియో చేయాలనుకున్నప్పుడు లోకేష్ కనగరాజ్ స్క్రిప్ట్ వివరించాడు. నేను ప్రీతి పాత్రలో నటించాలని చెప్పాడు. దీంతో స్టోరీ నచ్చడంతో నేను ఒప్పుకున్నాను. ఇందులో నా పాత్ర బలమైనది. అందరూ నా పాత్రతో కనెక్ట్ అవుతారు'' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
Latest News