|
|
by Suryaa Desk | Fri, Jul 25, 2025, 04:25 PM
తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని హీరోయిన్ కాజల్ అగర్వాల్. మొదటి తోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఒక్కో తో విజయాన్ని అందుకుంటూ తన క్రేజ్ మరింత పెంచుకుంటూ వచ్చింది.తక్కువ సమయంలోనే స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలకు జోడిగా కనిపించింది. తక్కువ సమయంలోనే నటిగా ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్న కాజల్.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తన ప్రియుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుని లకు బ్రేక్ తీసుకుంది. ఈ దంపతులకు బాబు నీల్ కిచ్లూ జన్మించిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కొన్నాళ్లు లకు దూరంగా ఉన్న కాజల్.. ఇప్పుడు సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని లకు బ్రేక్ ఇచ్చిన కాజల్.. ఇప్పుడు రీఎంట్రీలో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. గతేడాది భగవంత్ కేసరి లో నటించింది. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ డ్రామా సత్య మూవీలో నటించింది. ఇవే కాకుండా ఇండియన్ 2 చిత్రంలోనూ కనిపించింది. అయితే పెళ్లి తర్వాత కాజల్ నటించిన లు అంతగా హిట్ కాలేదు. దీంతో ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు కూడా రావడం లేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
కాజల్ ఫేవరెట్ హీరో గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. కాజల్ కు ఇష్టమైన హీరో ఎవరు అని అడగ్గా.. ఎన్టీఆర్ అని చెప్పింది. వీరిద్దరు కలిసి ఇదివరకు రెండు ల్లో నటించారు. అలాగే పక్కా లోకల్ అనే సాంగ్ కూడా చేసింది. ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. అలాగే తమిళంలో విజయ్ దళపతి తన ఫేవరేట్ హీరో అని చెప్పుకొచ్చింది.
Latest News