|
|
by Suryaa Desk | Fri, Jul 25, 2025, 04:14 PM
నటుడు ఫహాద్ ఫాజిల్ నటించిన తాజా చిత్రం ‘మారీశన్’. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ‘నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశం బార్సిలోనా. ప్రేక్షకులు తెరపై నన్ను చూసి ‘ఇక చాల్లే చూడలేకపోతున్నాం..’ అనుకున్న రోజు అక్కడికెళ్లి స్థిరపడతా. ప్రజలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్తా. నేను సరదాగా చెప్పడం లేదు. బార్సిలోనాలో క్యాబ్ నడపడం నాకు ఇష్టమైన పని ’ అని తెలిపారు.
Latest News