|
|
by Suryaa Desk | Thu, Jul 24, 2025, 03:48 PM
ఇటీవల విడుదలైన బాలీవుడ్ రొమాంటిక్ డ్రామ 'సైయారా' బాక్స్ఆఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టిస్తుంది. ఈ చిత్రం విమర్శకులు మరియు సినీ ప్రేమికుల నుండి అద్భుతమైన సమీక్షలను అందుకుంది మరియు భారతదేశం మరియు విదేశాలలో సంచలనాత్మక వ్యాపారం చేస్తోంది. ఇటీవలే ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, సైయారా యొక్క థియేటర్ రెస్పాన్స్ కారణంగా మేకర్స్ డిజిటల్ విడుదల ని 2025 దీవాలికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అహాన్ పాండే మరియు అనీత్ పాడా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో నటించారు. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హాట్‌షాట్ బాలీవుడ్ చిత్రనిర్మాత ఆదిత్య చోప్రా యష్ రాజ్ ఫిలిం బ్యానర్ పై నిర్మించారు.
Latest News