|
|
by Suryaa Desk | Wed, Jul 23, 2025, 05:15 PM
నటుడి నుండి దర్శకుడిగా మారిన RJ బాలాజీతో కోలీవుడ్ స్టార్ సూర్య తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మేకర్స్ 'కరుప్పు' అనే టైటిల్ ని లాక్ చేసారు. నటుడు సూర్య పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ని విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో త్రిష మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇంద్రన్స్, నాటి, స్వసికా, శ్షివాడ మరియు ఇతరులు కీలక పాత్రల్లో ఉన్నారు. ఈ చిత్రానికి జికె విష్ణు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. సాయి అభ్యంకర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Latest News