|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 02:27 PM
'బిగ్ బాస్ మలయాళం సీజన్ 7' కోసం జనం ఎంత ఎగ్జైట్ అయిపోతున్నారో... అంతే ఎగ్జైటింగ్ గా మేకర్స్ ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేశారు. కోలీవుడ్ స్టార్ మోహన్‌లాల్ హోస్ట్ చేస్తున్న ఈ సీజన్ 7.... ఆగస్ట్ 3వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఆసియా నెట్‌లో స్టార్ట్ అవబోతోంది. జియో హాట్ స్టార్ లో ఇరవై నాలుగు గంటలూ ఈ షో స్ట్రీమింగ్ కానుంది. ప్రోమో వీడియోలో డేట్ సడన్‌గా రివీల్ చేసి బుల్లితెర ఫ్యాన్స్ లో సంతోషాన్ని నింపారు నిర్వాహకులు.మలయాళ బిగ్ బాస్ షో ప్రోమో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఈ సీజన్ బాగా స్ట్రిక్ట్‌గా, సీరియస్‌గా ఉంటుందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. 'ఏంజెల్ లా యాక్ట్ చేయొద్దు.. సేఫ్ గేమ్ ఆడొద్దు... ఎంటర్‌టైన్ చేయడానికి వచ్చారంతే... గొడవలు చేయొద్దు' అని మోహన్ లాల్ కూడా క్లియర్ గా చెప్పారు. అంటే ఈసారి ఎమోషనల్ డ్రామా లేదా విక్టిమ్ కార్డ్స్ ఇందులో పనిచేయవన్నమాట.
Latest News