|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 02:28 PM
చాలా ఏళ్ల తర్వాత పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమా కోసం మీడియా ముందుకొచ్చారు. వేదికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిర్మాత ఎ.రత్నం మీదున్న అభిమానాన్ని చాటుకున్నారు. నిర్మాతగా సుధీర్ఘ అనుభవం, సినిమా ఇండస్ట్రీపై ఎంతో అవగాహన ఉన్న ఆయన్ను ఆంధ్రప్రదేశ్ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ప్రతిపాదించినట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ముందు ఈ ప్రతిపాదన పెట్టినట్లు తెలిపారు. రత్నం లాంటి నిర్మాత ఇండస్ట్రీకి ఎంతో అవసరమని చెప్పారు. రత్నం గారు ఆ పదవిని పొందుతారని ఆశిస్తున్నానన్నారు. ప్రాంతాలవారీగా సినిమాను విడదీసి చూడలేనని, కులం, మతం, ప్రాంతం అనే భేదం లేకుండా ప్రతిభ ఉంటే ఏ ఇండస్ట్రీలో అయినా రాణించవచ్చని పవన్ చెప్పారు.
Latest News