![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 16, 2025, 03:36 PM
టాలీవుడ్ ప్రముఖ నటుడు రవితేజ తండ్రి మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రాజు మరణించారన్న వార్త తనను కలచివేసిందని పవన్ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పవన్ చెప్పారు. రవితేజ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు (90) మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
Latest News