![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 07:51 PM
ఒకప్పుడు యాంకర్‌గా బిజీగా ఉన్న ఉదయభాను ఇప్పుడు కొంతకాలంగా అరుదుగా మాత్రమే కనబడుతున్నారు. ఇటీవల ఒక ఈవెంట్‌లో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ ఈవెంట్‌లో పాల్గొన్నట్లు తెలిపారు. ‘ఈ ఒక్క ఈవెంటే చేశాను.. మళ్ళీ చేస్తానో.. లేదో.. తెలియదు. రేపే ఈవెంట్ అనుకున్నా, చేసే రోజు ఈవెంట్ లేదు. ఇక్కడ పెద్ద సిండికేట్ ఉంది’ అని అన్నారు.రేపు ఈవెంట్ ఉంది అనగా.. గంట ముందు వరకు ఉంటామో లేదో తెలియదు. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇక్కడ. ఏం చెప్పినా హార్ట్ లో నుంచే చెప్తాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఉదయభాను. ఆమె చెప్పిన మాటలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీలో ప్రతి ఈవెంట్ లో కామన్ గా ఒకరిద్దరు యాంకర్లు మాత్రమే కనిపించడం ఈ మధ్య పరిపాటి అయిపోయింది. చిన్న ఈవెంట్లు అయితే వేరే వాళ్లు కనిపిస్తున్నారు గానీ.. ఏదైనా పెద్ద సినిమా ఈవెంట్లు అయితే కామన్ గా కనిపించే వారు ఒకరిద్దరు మాత్రమే ఉంటున్నారు. దీనిపై ఎప్పటి నుంచో పెద్ద చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉదయభాను చేసిన కామెంట్లు ఇప్పుడు వాటికి బలాన్నిస్తున్నాయి. ఒకప్పుడు ఉదయభాను స్టార్ యాంకర్ గా దూసుకుపోయింది. కానీ పెళ్లి తర్వాత పెద్దగా కనిపించట్లేదు. మళ్లీ ఈవెంట్లు చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Latest News