|
|
by Suryaa Desk | Tue, Jul 29, 2025, 08:28 PM
హైదరాబాదులో "రవితేజ థియేటర్ దిల్‌సుఖ్‌నగర్‌కు దగ్గరగా ఉన్న వనస్థలిపురం ప్రాంతంలో విభిన్నంగా ప్రారంభం కానుంది. ఇది స్టార్ Mass Maharaja రవితేజ మరియు Asian Cinemas (Suniel Narang) కలిసి ఏర్పాటు చేసిన 6 లేటెస్ట్ స్టేట్‑ఆఫ్‑ది‑ఆర్ట్ స్క్రీనులతో కూడిన ప్రీమియం . ఇందులో ఉంది:57 అడుగుల EPIQ స్క్రీన 4K ప్రొజెక్షన్ విన్డీజన్ Dolby Atmos ఆడియో వింగ్దు వనస్థలిపురంలో ఆరు స్క్రీన్లతో కూడిన ఈ మల్టీప్లెక్స్ జులై 31న గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.ఇప్పటికే థియేటర్ ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతంలో అత్యంత ఆధునిక సదుపాయాలతో కూడిన లగ్జరీ థియేటర్‌గా ART Cinemas నిలవబోతోంది.సుమారు 60 అడుగుల వెడల్పుతో గల భారీ స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ వంటి అత్యాధునిక టెక్నాలజీతో ప్రేక్షకులకు వినూత్నమైన సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఇంకా చెప్పాలంటే, స్క్రీనింగ్ టెస్టింగ్ ప్రక్రియ కూడా విజయవంతంగా పూర్తయ్యింది.రవితేజ థియేటర్ అయిన ART Cinemas లో మొదటి సినిమాగా ‘కింగ్డమ్’ ప్రదర్శించబోతుండటంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఊపుమీదున్నారు. ఈ సందర్భంగా, అభిమానులు రవితేజ మరియు విజయ్ దేవరకొండకు శుభాకాంక్షలు తెలుపుతూ, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, సూర్యదేవర నాగవంశీ మరియు సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘కింగ్డమ్’ ఈ నెల 31వ తేదీన grandగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News