|
|
by Suryaa Desk | Tue, Jul 29, 2025, 06:00 PM
గౌతమ్ టిన్నురి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త స్పై యాక్షన్ మూవీ 'కింగ్డమ్' జూలై 31, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుంది. ఈ చిత్రంలో విజయ్ స్పై ఏజెంట్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో నవ్య స్వామి, సత్య దేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క కర్ణాటక థియేటర్ రైట్స్ ని బెంగళూరు కుమార్ ఫిలిమ్స్ బ్యానర్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో భగ్యాశ్రీ బోర్స్, సత్య దేవ్ ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News