|
|
by Suryaa Desk | Tue, Jul 29, 2025, 05:40 PM
బాలీవుడ్ లో ఇటీవలే విడుదలైన రొమాంటిక్ డ్రామా 'సైయారా' తాజా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన మరియు కొత్తగా వచ్చిన అహానా పండే మరియు అనీత్ పాడాను తమ తొలి పాత్రలలో నటించిన ఈ చిత్రం బాక్స్ఆఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టిస్తుంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 404 కోట్లు వాసులు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. అంతేకాకుండ ఈ చిత్రం త్వరలో 500 కోట్ల క్లబ్ లో జాయిన్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు 2025 నాటి అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా ఈ సినిమా మారింది. ఈ చిత్రాన్ని హాట్‌షాట్ బాలీవుడ్ చిత్రనిర్మాత ఆదిత్య చోప్రా యష్ రాజ్ చిత్రాల క్రింద పంపిణీ చేశారు.
Latest News