|
|
by Suryaa Desk | Mon, Jul 28, 2025, 11:59 PM
ఆ కాలంలో పవన్ కల్యాణ్‌కు రెన్షి రాజాతో మొదటిసారి పరిచయం ఏర్పడింది. దాదాపు మూడున్నర దశాబ్దాల విరామం తర్వాత, వారిద్దరూ మళ్లీ కలుసుకోవడం జరిగింది. ఈ సందర్భాన్ని పవన్ తన సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు.తమిళనాడుకు చెందిన రెన్షి రాజాను 34 సంవత్సరాల తర్వాత మళ్లీ కలవడం ఒక అనందకర అనుభూతిగా ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. 1990ల ప్రారంభ దశలో, తాను షిహాన్ హుస్సేని కరాటే స్కూల్‌లో శిక్షణ తీసుకుంటున్నప్పుడు, రెన్షి రాజా తనకు సీనియర్గా ఉన్నారని చెప్పారు.తాను గ్రీన్ బెల్ట్ సాధించిన సమయంలో, రెన్షి రాజా ఇప్పటికే బ్లాక్ బెల్ట్ పొందినట్లు పవన్ గుర్తు చేశారు. ప్రస్తుతం రెన్షి రాజా, తమ శిక్షణా సంస్థకు నాయకత్వం వహిస్తూ, షిహాన్ హుస్సేని ఆశయాలను ముందుకు తీసుకెళ్తుండడం ఎంతో సంతృప్తి కలిగించిందని తెలిపారు.ఈ భేటీలో వారిద్దరూ మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అభిమానం, షిహాన్ హుస్సేన్‌తో గల అనుబంధం గురించి స్మరణలు పంచుకున్నారని పవన్ వివరించారు. అదే సందర్భంలో, రెన్షి రాజాతో కలిసి కరాటే ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలును పవన్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు, నెటిజన్లను అలరించారు.
Latest News