|
|
by Suryaa Desk | Mon, Jul 28, 2025, 03:16 PM
జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడు ధనుష్ ఇండియా మాజీ అధ్యక్షుడు ఎపిజె అబ్దుల్ కలాం బయోపిక్ కోసం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో జతకట్టారు. ఈ చిత్రానికి 'కలాం' అనే టైటిల్ ని లాక్ చేసారు. 'ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా' అనే ట్యాగ్‌లైన్ తో ఈ చిత్రం రానుంది. ఈ సినిమా యొక్క కాన్సెప్ట్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు నటుడు ధనుష్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి శుభాకాంక్షలు తెలియజేసారు. అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ ని త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ బయోగ్రాఫికల్ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మరియు అనిల్ సుంకర సంయుక్తంగా టి-సిరీస్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తారు. ఈ చిత్రం కోసం స్క్రీన్ ప్లే సైవిన్ క్వాడ్రాస్ రాశారు.
Latest News