|
|
by Suryaa Desk | Sat, Jul 26, 2025, 08:20 AM
భారతదేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ మరియు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా యొక్క హై-బడ్జెట్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'స్పిరిట్' ఒకటి. స్పిరిట్ ప్రభాస్ సిల్వర్ జూబ్లీ ఫిల్మ్. తాజాగా ఇప్పుడు, ఈ సినిమా దర్శకుడు సందీప్ ఈ చిత్రం సెప్టెంబర్ లో షూటింగ్ ని ప్రారంభిస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో దృవీకరించారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమిరి మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఉపేంద్ర లిమాయే ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. సందీప్ తన భద్రాకలి పిక్చర్స్ బ్యానర్ కింద ఈ చిత్రాన్ని సహ-నిర్మించాడు. ఈ చిత్రానికి సంగీతం హర్షవర్ధన్ రమేశ్వర్ అందిస్తున్నారు. టి-సిరీస్‌కు చెందిన బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ ఈ ప్రాజెక్టును బ్యాంక్రోలింగ్ చేస్తున్నారు.
Latest News