|
|
by Suryaa Desk | Wed, Jul 23, 2025, 09:52 PM
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన నటించిన సినిమాలు అతనికి విశేష పేరు మరియు గుర్తింపును తెచ్చిపెట్టాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఇకపై చేయబోయే సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన, గతంలో కమిట్ అయిన చిత్రాలన్నింటినీ పూర్తి చేయడంపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో హరిహర వీరమల్లు సినిమా రేపు భారత్‌లో విడుదల కాబోతున్న నేపథ్యంలో, యూఎస్ఏలో ఇప్పటికే ఈరోజే ప్రీమియర్ షోలు పెట్టారు. అయితే ఆ ప్రీమియర్ షోలు చూసినవారి అభిప్రాయాల ప్రకారం, ఈ సినిమా ఎలా ఉందన్నదాన్ని ఇప్పుడు ఒకసారి పరిశీలించాలి.ఈ సినిమా కథ విషయానికి వస్తే కోహినూరు డైమండ్ నుంచి స్టార్ట్ అవుతోంది. భాగ్యనగరం లోని నిజం రాజులు దాన్ని దక్కించుకోవడానికి ఏం చేశారు. ఆ రాజులు దానికోసం ప్రయత్నిస్తున్న సమయం లో అక్కడి ప్రజలు ఎలాంటి ఇబ్బందులను పడ్డారు. ఇది తెలుసుకున్న వీరమల్లు ప్రజల వైపు ఎలా నిలబడ్డాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే…ఇప్పుడు విశ్లేషణలోకి వస్తే, ఈ సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు పూర్తిగా ఎంగేజింగ్‌గా అనిపించలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కథలో కొన్నిచోట్ల అనవసరమైన సన్నివేశాలు రావడంతో కథ నెమ్మదిగా మారి కొంత బోరింగ్‌గా కూడా అనిపించిందట. కంటెంట్ ఉన్నప్పటికీ దర్శకుడు జ్యోతికృష్ణకి ఒక స్టార్ హీరోని సరిగా హ్యాండిల్ చేయడం కష్టంగా కనిపించింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ పరంగా బలహీనతలు స్పష్టంగా కనిపించాయని చెబుతున్నారు. దర్శకుడు దృష్టిలోని విజన్‌ను సరైన రీతిలో తెరపై ఆవిష్కరించలేకపోయినట్టు అనిపిస్తోంది.విజువల్స్ కూడా పెద్దగా ఆకట్టుకునే విధంగా లేవని, గ్రాఫిక్స్ పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సినిమాకు నష్టమే అయినట్టు తెలుస్తోంది. సెకండ్ హాఫ్‌లో పవన్ కళ్యాణ్ చేసే యాక్షన్ సీక్వెన్సులు కొంత ఓవర్‌గా అనిపించాయని అంటున్నారు. అలాగే క్లైమాక్స్ భాగం కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదన్న అభిప్రాయాలు యూఎస్‌ఏ ప్రీమియర్ షోల తర్వాత వచ్చాయి.ఇప్పుడు విశ్లేషణలోకి వస్తే, ఈ సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు పూర్తిగా ఎంగేజింగ్‌గా అనిపించలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కథలో కొన్నిచోట్ల అనవసరమైన సన్నివేశాలు రావడంతో కథ నెమ్మదిగా మారి కొంత బోరింగ్‌గా కూడా అనిపించిందట. కంటెంట్ ఉన్నప్పటికీ దర్శకుడు జ్యోతికృష్ణకి ఒక స్టార్ హీరోని సరిగా హ్యాండిల్ చేయడం కష్టంగా కనిపించింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ పరంగా బలహీనతలు స్పష్టంగా కనిపించాయని చెబుతున్నారు. దర్శకుడు దృష్టిలోని విజన్‌ను సరైన రీతిలో తెరపై ఆవిష్కరించలేకపోయినట్టు అనిపిస్తోంది.విజువల్స్ కూడా పెద్దగా ఆకట్టుకునే విధంగా లేవని, గ్రాఫిక్స్ పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సినిమాకు నష్టమే అయినట్టు తెలుస్తోంది. సెకండ్ హాఫ్‌లో పవన్ కళ్యాణ్ చేసే యాక్షన్ సీక్వెన్సులు కొంత ఓవర్‌గా అనిపించాయని అంటున్నారు. అలాగే క్లైమాక్స్ భాగం కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదన్న అభిప్రాయాలు యూఎస్‌ఏ ప్రీమియర్ షోల తర్వాత వచ్చాయి.కీరవాణి సంగీతం కొంతమేర వరకు ఓకే అనిపించినా, బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మరింత జాగ్రత్త వహిస్తే బాగుండేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ లుక్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నట్టు సమాచారం. బాబీ డియోల్ నటన కూడా ఆకట్టుకునేలా ఉందని పలువురు చెబుతున్నారు.
Latest News