|
|
by Suryaa Desk | Wed, Jul 23, 2025, 04:46 PM
పవన్ కల్యాణ్ 'హరి హర వీరమల్లు' పార్ట్ 2 పై కీలక సమాచారాన్ని వెల్లడించారు. 'హరి హర వీరమల్లు పార్ట్ 1 - స్వోర్డ్ vs స్పిరిట్' ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నిన్న మంగళగిరిలో పవన్ కల్యాణ్ విలేఖరులతో మాట్లాడారు.రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా పార్ట్ -2 ను వచ్చే డబ్బులు, తనకున్న సమయాన్ని బట్టి చేస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. అందుకు భగవంతుడి ఆశీస్సులు కూడా కావాలని అన్నారు. ఇప్పటికే పార్ట్ – 2 షూటింగ్ 20 – 30 శాతం పూర్తయిందని వెల్లడించారు.మూవీ విషయానికి వస్తే.. ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లిపోయిన కోహినూర్ వజ్రాన్ని తీసుకొచ్చే వీరుడి కథ ఇది అని తెలిపారు. 'హరి హర వీరమల్లు' పూర్తి ఫిక్షనల్ స్టోరీ అని తెలిపారు. సర్వాయి పాపన్న కథతో దీనికి సంబంధం లేదని పేర్కొన్నారు.
Latest News